మీడియా: మేడం, మీరు జగన్గారికి కటిఫ్ చెప్పి, మళ్లీ డియస్(కాంగ్రెస్)హస్తం పటుకొన్తున్నారని,అందుకే ఇన్నాళ్ళు జగన్కి మొహం చాటేశారని మాకు తెలిసింది. దానికి మీరేమంటారు మేడం?
ఆడదాన్నిసేసి,అనగారినోల్లని చేసి ఇట్లా మాయెంటపడుటేనా? ఏంది? అయినా, నేనేడకి పోయినానని, మీరు నాపైన కధలు కధలు గట్టి రాసుకు పోతుండ్రు? నేను నా ఇంట్లనే కుసుండి, రేపు నా బతుకేట్లా తెల్లరుద్దా అని పరేశాన్ అవుతా, అలోసనలు సేత్తుండా! అదిగూడ నేను మీకు సమ్జయిన్చాల్నా? పోయి, రెండు కళ్ళు మూడు కళ్ళు అనేటి ఆ బాబు నడుగుండ్రి, నడుమిట్ల గేడ దాకున్నావని? పోయి ఆ మందు బాబు కెసిఆర్ ని అడుగుండ్రి మద్దె మద్దెలో అట్లా సప్పుడు సేయక సల్లబడినవెందుకని? అంతే గానీ, నా ఎనుక పడితే యెట్లా అన్నా? అసలే నోరు లేని ఆడదాన్ని! కనీసం నా తోటి ఆడది ఆ సోనియమ్మాకైన నా గోడు సేప్పుకొందామని నా సేక్రటరిని బట్కోని, ఇన్ని దినాలుగా సప్పుడు సేయకుండా తొమ్మిది పేజీల ఉత్తరం రాసుకుర్సున్న! ఇదో! ఆ ఉత్తరం నమ్మ కుంటే మీరే సుస్కొండ్రి. ఆనక, దానేనుక మల్ల కొత్త కధల్లల్లి, నాకు మా తమ్మీ జగనుకు ముళ్ళు పెట్టమాకండి. ఆ సోనియమ్మ నా మాటినుకొని, నాడే మా జగనుని చెన్కనేక్కిన్చుకొనుంటే,ఈదినం ఆ చిరంజీవిని నెత్తిన ఎత్తుకోనే పని లేదుగా? అయినా ఏవరినని ఏమి లాభం మా పెద్దన్న రాజసేకరుడు లేన్నపుడు? అంతా, మా నసిబుల ఇలాగె జరుగుండాలనిరాసుండే మరీ? ఏవరినని ఏమి లాభం?
No comments:
Post a Comment